గత కొన్ని రోజులు కితం టాలీవుడ్ లో వచ్చిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం “బ్రో ది అవతార్” విషయంలో కూడా లేదు అనుకున్న పొలిటికల్ కాంట్రవర్సీ కూడా మళ్ళీ వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనితో మంత్రి అంబటి పవన్ పర్సనల్ లైఫ్ ని తీస్తాను అని పవన్ మాజీ భార్యలను కూడా ఇందులోకి లాక్కొచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం రేణు దేశాయ్ చాలా గట్టిగా స్పందించింది. అవును పవన్ నాకు చేసింది అన్యాయమే కావచ్చు కానీ తాను సమాజం పట్ల చూపించే భాద్యతకి మాత్రం నేనెప్పుడూ మద్దతుగానే ఉంటాను అని తెలిపింది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేయగా లేటెస్ట్ మరో అంశం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లేటెస్ట్ గా యూఎస్ లో పవన్ తనయుడు అకీరానందన్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుతో అయితే కలిసి కనిపించిన ఫోటోలు మంచి వైరల్ గా మారాయి. అలాగే దీనితో ఇప్పుడు అకిరా నటన నేర్చుకుంటున్నాడు అనే న్యూస్ ని కూడా రివీల్ చేయడంతో ఒక్కసారిగా అకీరానందన్ సినిమా ఎంట్రీ వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే దీనిపై మాత్రం రేణు దేశాయ్ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు అకీరాకి నటన మీద కానీ హీరో అవ్వాలని గాని ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు సో దయాచేసి నేను పోస్ట్ చేసే ప్రతీ దాన్ని ఇలా మార్చడం ఆపండి ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో నేనే దానిని మొదట తెలియజేస్తాను అంటూ రూమర్స్ కి ముగింపు ఇచ్చింది. దీనితో పవన్ ఫాన్స్ కూడా కాస్త చల్లబడ్డారు.
#RenuDesai clarification about Akira Film Debut pic.twitter.com/wNtHZnibIO
— Pawan Kalyan Holics™ (@PSPKHolics) August 21, 2023