ఆ విషయంలో ఉపాసనను ఆకాశానికెత్తిన రేణూ దేశాయ్!

Renu Desai Praise Upasana Konidela About URlife Website

మెగా ఫ్యామిలీకి రేణూ దేశాయ్‌కి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో వేరు పడ్డా కూడా మెగా కుటుంబంతో మాత్రం మంచి బంధాలే ఉన్నాయి. అకీరా నందన్, ఆద్యలంటే చిరుకు మహా ప్రాణం. ప్రతీ పండుగకు అకీరా, ఆద్యలు మెగా ఇంట్లో సందడి చేయాల్సిందే. మెగా ఫ్యామిలీ ఎంతో ఘనంగా జరుపుకునే దీపావలి, సంక్రాంతి పండుగలకు ఆద్య, అకీరాలు స్పెషల్ అట్రాక్షన్‌లుగా నిలుస్తారు.

Renu Desai Praise Upasana Konidela About URlife Website
Renu Desai Praise Upasana Konidela About URlife Website

ఇక ఆద్య, ఉపాసనలు బాగానే క్లోజ్. ఇక రేణూ దేశాయ్‌తోనూ ఉపాసనకు మంచి రిలేషన్ ఉంది. తాజాగా ఉపాసన చేసే మంచి కార్యక్రమాలపై రేణూ దేశాయ్ స్పందించింది. ఉపాసన ఈ మధ్య urlife అనే ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అందులో ఆరోగ్య రక్షణకు సంబంధించిన చిట్కాలుంటాయట. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చెబుతూ.. అందులో మంచి, ఆరోగ్యకరమైన, అందుబాటులో, సులభంగా చేసుకునే వంటకాల వివరాలుంటాయట.

Renu Desai Praise Upasana Konidela About URlife Website
Renu Desai Praise Upasana Konidela About URlife Website

ఇక ఈ వెబ్‌సైట్‌ను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రమోట్ చేసుకుంటోంది. ఉపాసన చేస్తోన్న ఈ పనికి ఇండస్ట్రీ నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆరోగ్య విషయంలో దానిపట్ల జాగ్రత్తలు తీసుకునే విషయంలో నువ్ అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తావ్ ఉపాసన అంటూ పొగిడేసింది. ఇక రేణూ ప్రశంసలకు పొంగిపోయిన ఉపాసన ధన్యవాదాలను తెలిపింది.