టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న ప్రముఖ హీరోస్ లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. మరి పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తుండగా తన పర్శనల్ లైఫ్ కోసం అయితే తెలుగు స్టేట్స్ లో ఒక తెరచిన పుస్తకం. అయితే రాజకీయాల్లో ఇంకా పవన్ పర్శనల్ లైఫ్ తోనే టార్గెట్ చేస్తున్నారు.
కానీ పవన్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. అయితే పవన్ రెండో భార్య అయినటువంటి రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయిన తర్వాత చాలానే భరించారు ఎదుర్కొన్నారు. కానీ ఫైనల్ గా టైగర్ నాగేశ్వరరావు అనే భారీ చిత్రంతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుండగా ఈ క్రమంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ గా మారింది.
కాగా ఆమె ఇన్నాళ్లు తన భర్త విషయంలో మీడియా వారు ఏదన్నా ప్రశ్న అదిరితే తనపై సింపతి కోసం అడిగేవారు అనుకునేదాన్ని అందుకే చెప్పేదాన్ని అని కానీ దానిని అడ్డు పెట్టుకొని ఆ వ్యక్తిని విమర్శించడానికి వాటి ద్వారా యూట్యూబ్ రీచ్ లు న్యూస్ టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకోవడానికి అనుకోలేదని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.
దీనితో పవన్ పేరుతో ఆమెని మీడియా వారు ఏ రకంగా వినియోగించుకుంటున్నారో నాకు ఇపుడు అర్ధం అయ్యింది అని అయితే తెలిపింది. దీనితో పవన్ ఫ్యాన్స్ తమ వదిన ఇప్పటికైనా రియలైజ్ అయ్యింది అని కాస్త కుదుట పడ్డారు.