ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. పవన్ కళ్యాణ్‌పై రేణూ దేశాయ్ పరోక్ష కామెంట్స్

Renu Desai Indirect Comments On Pawan Kalyan About Love and Cheating

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ విషయాలు, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా తాజాగా రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చింది. నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రేణూ దేశాయ్ చెప్పిన సమాధానం.. పవన్ కళ్యాణ్ చేసిన గాయాన్ని ఉద్దేశించి చెప్పినట్టుగానే అనిపిస్తున్నాయి.

Renu Desai Indirect Comments On Pawan Kalyan About Love and Cheating
Renu Desai Indirect Comments On Pawan Kalyan About Love and Cheating

డిప్రెషన్, సూసైడ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు రేణూ దేశాయ్ సమాధానం ఇచ్చింది. నీ జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ప్రేమలో విఫలమైతే ఎంతో బాధ కలుగుతుందని నాకు తెలుసు. మనం ప్రేమించే వ్యక్తి మన పక్కనలేడని.. మనల్ని మోసం చేశాడనే ఆలోచనలు చాలా కష్టంగా ఉంటాయి. కానీ, ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఆ బాధ నుంచి బయటపడొచ్చు. కౌన్సిలింగ్‌ తీసుకోవడం, కుటుంబసభ్యులు, స్నేహితుల సాయంతో మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు అని చెప్పుకొచ్చింది.

అలా రేణూ దేశాయ్ ప్రేమ, మోసం గురించి చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ టాపిక్‌ను పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలోని ఓ ఇంటర్వ్యూలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. భార్య ఉండగా.. వేరే అమ్మాయితో ఉంది.. పిల్లలను కంటే ఎలా ఉంటుందో అనుభవించే వారికి ఆ బాధ తెలుస్తుందని ఎమోషనల్ అయింది. మళ్లీ నిన్న కూడా ఇలాంటి టాపికే మాట్లాడింది. మొత్తానికి రేణూ దేశాయ్ మాటలు మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.