నా 39 ఏళ్లలో ఇలాంటిది చూడలేదు!.. రేణూ దేశాయ్ షాక్

Renu Desai About Sky And Nature pics

రేణూ దేశాయ్‌కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. పదహారేళ్ల వయసులోనే మొదటి సారిగా ఫోటో షూట్ చేయించుకున్నప్పుడే కెమెరాతో ప్రేమలో పడిపోయానని, అలా తనకు సినిమా రంగంపై ఇష్టం ఏర్పడిందని ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రేణూ దేశాయ్‌కు ఉన్న ఫోటోగ్రఫి పిచ్చి ఆద్యకు వచ్చిందన్న సంగతి విదితమే.

Renu Desai About Sky And Nature pics
Renu Desai About Sky And Nature pics

వీరిద్దరూ ఫోటోలు తీసేందుకు ముందుంటారు. ప్రకృతి ప్రేమికురాలిగా ఎప్పుడూ నేచర్‌కు సంబంధించిన ఫోటోలను తీస్తూ ఉంటుంది. ఆకాశం, అడవి, జలపాతాలు, సముద్రాలు, వర్షం ఇలా వాతావరణంలోవచ్చే మార్పులన్నింటిని రేణూ దేశాయ్ బంధిస్తుంది. నిన్న హైద్రాబాద్‌లో వర్షం ఎలా కురిసిందో.. వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో అందరికీ తెలిసిందే. సాయంత్రం ఆరు గంటలకు తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ రేణూ దేశాయో చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.

Renu Desai About Sky And Nature pics
Renu Desai About Sky And Nature pics

ఇది బ్లాక్ అండ్ వైట్ పిక్ కాదు.. నిన్న సాయంత్రం క్లిక్ చేసిన కలర్ పిక్. నా ఈ 39 ఏళ్ళలో నిన్న సాయంత్రం చూసినట్టుగా ఆ ఆకాశాన్ని, ఆ వాతావరణాన్ని నేను ఇంత వరకు చూడలేదు. ఆకాశం ఎంతో వాస్తవికమైనదిగా.. సినిమాలో చూపించినట్టుగా నేరుగా అనిపించింది. ఈ పిక్చర్ సాయంత్రం 6 గంటలకు తీశాను ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు.. ఆకాశం తనను తానే అంత అందంగా తయారైంది. అంటూ నేచర్‌ గురించి ఎంతో గొప్పగా వర్ణించింది. ఈ పోస్ట్‌లో రేణూ దేశాయ్ తన వయసును అనుకోకుండా బయటపెట్టేసింది.