అందుకే పవన్ కళ్యాణ్‌కు దూరంగా.. రేణూ దేశాయ్ పోస్ట్ అర్థం అదేనా?

Renu desai about RelationShip

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె రాసే కవిత, వెల్లిబుచ్చే భావాలు అన్నీ కూడా అందరిలోనూ ఆలోచనలు రేకెత్తేలా ఉంటాయి. ఆమె తన కవితల్లో జీవిత సారాన్ని చెబుతూ ఉంటుంది. తాజాగా అలానే ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. అందులో రేణూ దేశాయ్ చెప్పిన విషయాలు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్‌తో దూరంగా ఎందుకు ఉందో చెప్పకనే చెప్పేసినట్టు కనిపిస్తోంది. అసలు రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఏముందో ఓసారి చూద్దాం.

Renu desai about RelationShip
Renu desai about RelationShip

వయసు పెరుగుతున్నా కొద్దీ, అనుభవాలు ఎదురవుతున్నా కొద్దీ కొన్ని పాఠాలను కచ్చితంగా తెలుసుకోవాల్సి.. నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. అందులో భాగంగా తనకు ఓ గుణపాఠం తెలిసి వచ్చిందని రేణూ తెలిపింది. మనం ఏ మనుషులతో కలిసి ఉన్నా కూడా అది ఫ్యామిలీ మెంబర్ అయినా, ఫ్రెండ్స్ అయినా, పని చేసే సహచరులైనా కూడా ఒకరి పట్ల మరొకరికి ప్రేమ గౌరవభావాలు ఉండాల్సిందే. రిలేషన్ షిప్‌లో ఉన్న ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి అన్నింట్లో భాగస్వామిగా ఉండాలని తెలిపింది.

ఆ రిలేషన్ షిప్ టూ వే (రెండు దారులు)గా ఉ:డాలి.. అలా ఏది తక్కువైనా కూడా అవతలి వారికి బాధను కలిగించేలా ఉంటుంది. అయినా ఈ వయసు పెరుగుతున్నా కొద్దీ ఇంకోటి కూడా నేర్చుకున్నాను.. ఏది జరిగినా కూడా ఎంత బాధలు వచ్చినా కూడా అవతలి వ్యక్తి నుంచి దూరంగా ప్రశాంతంగా ఉండాలని తెలిసివచ్చిందంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. మొత్తానాకి తమ బంధంలో ఒకరిపట్ల ఒకరికి గౌరవ భావాలు లేకపోవడంతో విడిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. తాను భార్యగా ఉన్నా కూడా అన్నా లెజినావోతో పిల్లల్ని కన్నాడని రేణూ దేశాయ్ ఆ మధ్య చెబుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.