విడుదలయిన కింగ్‌ ఆఫ్‌ కొత్త

పాన్‌ ఇండియా స్టార్‌ యాక్టర్‌ దుల్కర్‌ సల్మాన్‌ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్‌తోపాటు అంచనాలు మామూలుగా ఉండవు. ఈ స్టార్‌ యాక్టర్‌ తాజాగా కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కెరీర్‌లో తొలిసారి గ్యాంగ్‌ స్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్స్‌ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ చిత్రం దుల్కర్‌ సల్మాన్‌ అభిమానులకు కావాల్సిన మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ ఎలిమెంట్స్‌ను అందిస్తున్నట్టు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

కథపరంగా కొత్తదనం ఏవిూ లేకున్నా.. మేకింగ్‌ స్టైల్‌, ప్రజెంటేషన్‌, షబీర్‌, నైలా అద్భుతమైన యాక్టింగ్‌ ఈ చిత్రాన్ని పైసా వసూల్‌ ఎంటర్‌టైనర్‌గా మార్చేశాయని అంచనా వేస్తున్నారు. కింగ్‌ ఆఫ్‌ కొత్త పక్కా బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలువడం ఖాయమంటున్నారు. అభిలాష్‌ జోషి దుల్కర్‌ సల్మాన్‌ను పక్కా మాస్‌ అవతార్‌లో చూపించడంలో సక్సెస్‌ అయ్యాడని అంటున్నారు సినీ జనాలు. ఇక బీజీఎం లెవల్‌ సినిమా స్థాయిని మరింత పెంచినట్టు ట్రేడ్‌ సర్కిల్‌ టాక్‌.

ఇదిలా ఉంటే కింగ్‌ ఆఫ్‌ కొత్త బాక్సాఫీస్‌ కలెక్షన్ల అప్‌డేట్‌ రావాల్సింది. గ్యాంగ్‌ స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో కోలీవుడ్‌ భామ ఐశ్వర్య లక్ష్మి లో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. ప్రసన్న, నైలా ఉషా, చెంబన్‌ వినోద్‌, గోకుల్‌ సురేశ్‌, షవ్మిూ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు.