Kamal Hasan : విక్రమ్ సినిమా థియేట్రికల్‌ రైట్స్ దక్కించుకున్న రెడ్ జెయింట్ సంస్థ…!

Kamal Hasan: నటనలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి,విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్. ప్రస్తుతం కమల్ హాసన్,లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాని చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శాన్వీశ్రీవాత్సవ హీరోయిన్గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్స్‌ పతాకంపై రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో అలనాటి అందాల తార మహేశ్వరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండాఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ జూన్ 30న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధం అవుతోంది.అనిరుధ్‌ రచిచంద్రన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ చర్చనీయాంశం అయింది. రాధేశ్యాం చిత్రానికి సంబంధించిన తమిళ్ రిలీజ్ హక్కులను కొన్న రెడ్‌ జెయింట్‌  సంస్థ విక్రమ్ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకొని వార్తల్లో నిలిచారు. ఈ రెడ్ జెయింట్‌ సంస్థ ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధికి  సంబంధించింది కావడం విశేషం. రాధేశ్యాం సినిమా వల్ల ఈ సంస్థకు నష్టాలే మిగిలాయి. ఇప్పుడు విక్రమ్ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ఎలాంటి లాభాలను చేకూరుస్తాయి అన్నది చూడాలి.