RC 15: శంకర్ ఖరీదైన పాటలు.. ఎంత ఖర్చులో..

రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెండు భిన్నమైన నేపధ్యాలలో కథని దర్శకుడు శంకర్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రికొడుకులు పాత్రలో నటిస్తున్నాడు. ఇక మూవీలో హీరోయిన్స్ గా అంజలి, కీయరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి సంబందించిన మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుంది. శంకర్ సినిమా అంటే సాంగ్స్ చాలా రిచ్ గా ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. ఇక ఆ సాంగ్స్ కోసం కోట్ల రూపాయిలు శంకర్ ఖర్చు పెడుతూ ఉంటాడు. రోబోలో కిలిమింజారో పర్వతంపై చిత్రీకరించారు. అలాగే ఐ సినిమాలో కూడా ఓ పాటని చైనా సరిహద్దులో చిత్రీకరించారు.

ఇలా చాలా సినిమాలలో ఆయన పాటలు చాలా ప్రత్యేకతని సంతరించుకుంటాయి. ఇక తాజాగా రామ్ చరణ్ సినిమాలో కూడా అలాంటి ఓ డ్యూయెట్ కోసం నిర్మాత దిల్ రాజు ఏకంగా 15 కోట్ల రూపాయిలు వెచ్చించినట్లు తెలుస్తుంది. నిజానికి దిల్ రాజు ఈ బడ్జెట్ తో ఓ మినిమం రేంజ్ మూవీ తీసేస్తాడు. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఒక సాంగ్ కోసం ఆ స్థాయిలో బడ్జెట్ ని కేటాయించడం నిజంగా విశేషం అని చెప్పాలి.

ఇక మరో పాట కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఈ పాటలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, ఈ కారణంగానే దిల్ రాజు ఆ రేంజ్ లో బడ్జెట్ పెట్టడానికి సిద్ధం అయిట్లుగా తెలుస్తుంది. దిల్ రాజు ఈ సాంగ్స్ కోసం పెట్టిన బడ్జెట్ తో చిన్న సినిమాలు రెండు, మూడు తీసి హిట్ కొట్టే సత్తా ఉంది. అయితే శంకర్, రామ్ చరణ్ మీద నమ్మకంతో ఈ రేంజ్ లో బడ్జెట్ పాటల మీద పెడుతున్నారు. మరో వైపు ఈ సినిమాకి సంబంధించి ఓ సాంగ్ ని హైదరాబాద్ పాతబస్తీలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.