Ravi Teja: ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా తర్వాత `థడాకా` సినిమా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా `టైగర్ నాగేశ్వరరావు`.
టైగర్ నాగేశ్వరరావు సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ నాగేశ్వర్ రావు సినిమా గజదొంగ బయోపిక్ సంబంధించినది. స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఈ సినిమా.ఓ దొంగ బయోపిక్ తీయడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ కూడా మొత్తం పూర్తి చేసుకున్నారు.ఈ ఉగాదికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అయితే.. టైగర్ నాగేశ్వరరావు కథలో అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన సంగతులున్నాయి అంట. అవన్నీ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చే విషయాలే కావడం విశేషం, అందుకే ఈ సినిమాని మాస్ మహారాజా రవితేజ ఓకే చేశారని సమాచారం.తెలుగులో తీసి, అన్ని భాషల్లోనూ డబ్ చేయడం కాకుండా, అథెంటిక్ గా.. ఈ సినిమాని తీయాలని చూస్తున్నారు. అందుకోసం బాలీవుడ్ తారాగణాన్ని రంగంలోకి దింపాలన్నది ఆయన ప్లాన్. కథానాయిక, విలన్, ఇతర సపోర్టింగ్ రోల్స్ ఇలా.. అన్ని పాత్రలకూ స్టార్ కాస్టింగ్ నే తీసుకోవాలనుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా బిజీనే. వాళ్ల డేట్లు దొరకడం కష్టమవుతోంది. అందుకే ముందే డేట్లు లాక్ చేసుకొనే పనిలో ఉన్నారట చిత్రబృందం.