మాస్ మహారాజ్ కి టాటా చెప్పేసి పవర్ స్టార్ కి హాయ్ చెప్పబోతున్న శృతిహాసన్!

raviteja and shrutihasan new movie shooting schedule wrapped up
raviteja and shrutihasan new movie shooting schedule wrapped up
Shruti_Haasan

హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న’ క్రాక్’ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇకపోతే ఈ రెండు సినిమాల్లో ఆమె అద్భుతమైన పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. కాగా వీటిలో ‘క్రాక్’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల గోవాలో ప్రారంభం అయింది. రవితేజతో రెండోసారి ఈ సినిమా ద్వారా జతకడుతున్న శృతిహాసన్ గోవాలో జరిగిన ఈ చివరి షెడ్యూల్లో ఆయనతో కలిసి ఒక పాట కోసం ఆడి పాడినట్టు సమాచారం. అలానే శృతి, రవితేజ తో పాటు సినిమాలోని ముఖ్య తారాగణం పాల్గొన్న పలు కీలక సన్నివేశాలు కూడా ఇదే షెడ్యూల్ లో పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లేడి విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షెడ్యూల్ నేటితో పూర్తి అయిందని దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ మరియు హీరోయిన్ శృతిహాసన్ లు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పలు ఫోటోలు పోస్టు చేశారు. ఇక దీని అనంతరం రాబోయే జనవరిలో శృతిహాసన్ వకీల్ సాబ్ షూటింగులో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. కాగా ఇందులో ఆయన భార్య పాత్రని శృతి హాసన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్నారు.