మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఫుల్ ఫాం మోడ్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరంలో జరిగిన ప్రయోగాలు పెద్దగా కలిసిరాకపోవడంతో, ఈసారి పూర్తి బిజినెస్ మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘అనార్కలి’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా… ఈ టైటిల్ చుట్టూ ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి 2026 రిలీజ్‌గా ప్రీ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ కూడా చేయడంతో, సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది.
ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి మొదలవుతోంది. కథ, స్క్రీన్‌ప్లేపై పూర్తి ప్రిపరేషన్ అయ్యింది కాబట్టి టైటింగ్‌కి ఇబ్బందులు ఉండబోవని టీం కాన్ఫిడెంట్. ఇప్పటికే చిరంజీవి – అనిల్ రావిపూడి మూవీ, విజయ్ తలపతి ‘జన నాయగన్’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’లు సంక్రాంతికి లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ అనౌన్స్‌మెంట్‌తో పోటీ ఇంకాస్త హీట్ పెరిగింది. ‘అనార్కలి’ సినిమాలో ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ కూడా మిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి ప్రయోగాల్లో విఫలమైన తర్వాత రవితేజ పక్కా కమర్షియల్ ట్రాక్‌కి మళ్లడమే ఈ సినిమా ప్రత్యేకత.
‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ తర్వాత కిషోర్ తిరుమల చేస్తున్న మూవీ ఇది కావడం, నిర్మాతగా సుధాకర్ చెరుకూరి ఉండటంతో ప్రాజెక్ట్ మీద నమ్మకం పెరుగుతోంది. ఇకపై వచ్చే కొన్ని నెలలు షూటింగ్ పూర్తి చేసి, వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం తక్కువగా ఉండటం వల్ల అనుకున్న టైమ్‌కి విడుదలయ్యేలా గట్టి ప్రణాళిక వేస్తున్నారు. ఒకవేళ ఈ సంక్రాంతి సెటప్‌లో బాలకృష్ణ ‘అఖండ 2’ డేట్ మార్చినట్లయితే, రవితేజ సినిమా మరింత డోమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఇది రవితేజకు మరో ‘ధమాకా’ అవుతుందా అనేది చూడాలి.