తెలుగు ఇండస్ట్రీ లో మాస్ మహారాజ్ గా.. క్రేజీ హీరో గా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో గా ఎదిగి.. మోస్ట్ వాంటెడ్ హీరో గా నిలిచారు. మాస్ లో భయంకరమైన ఫాలోయింగ్ తో పాటు.. అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేస్తారు. అయితే రవితేజ 20 సంవత్సరాలకే హీరో అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న ఆర్టిస్ట్ గా నటించారు. హిందీ గ్యాంగ్ లీడర్ రీమేక్ ఆజ్ కా గూండారాజ్ లో చిరు ఫ్రెండ్స్ లో ఒకడిగా నటించాడు రవితేజ.
తెలుగులోనూ అల్లరి ప్రియుడు లాంటి సినిమాల్లో రాజశేఖర్ కి స్నేహితుడిగా నటించాడు. 30 దాటిన హీరో అయ్యి ఇప్పటికీ ఏలేస్తున్నాడు మాస్ రాజా. అలాంటి రవితేజ జర్నీ ఎంతోమంది కొత్త వాళ్ళకు ఆదర్శప్రాయం. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ అంటే సినిమాకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు కానీ ఒకప్పుడు ఈయన తీసుకున్న మొట్ట మొదటి పారితోషికం కేవలం వేలల్లోనే మాత్రమే. అది కూడా నిన్నే పెళ్లాడతా సమయంలోనే తీసుకున్నాడు రవితేజ. క్రాక్ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్ విషయాలు గుర్తు చేసుకున్నారు.
అందులో భాగంగానే చెప్తూ తన రెమ్యూనరేషన్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పాడు. అది కూడా 3500 రూపాయలు తీసుకున్నానని చెప్పాడు రవితేజ. అలా మొదటి చెక్ ని చాలా రోజులు దాచుకున్నారు. కానీ ఇప్పుడు టాప్ స్టార్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని.. ఆ జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కూడ మన చేతుల్లోనే ఉంటుంది అని రవితేజ అన్నారు.