రవితేజ తగ్గించేశాడా.? లేదా.? అసలేం జరిగింది.?

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూస్తూ వస్తున్నాడు హీరో రవితేజ.! ‘క్రాక్’, ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’.. ఇవి తప్ప, ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి.

తాజాగా, ‘ఈగల్’ సినిమాతోనూ సేమ్ నెగెటివ్ రిజల్ట్ చవిచూడాల్సి వచ్చింది రవితేజకి. లోపం ఎక్కడ జరుగుతోంది.? రవితేజ సినిమాల్లో కొత్తదనం కనిపించడంలేదు. కాన్సెప్ట్ ఎలా ఎంచుకున్నా, రవితేజ సినిమా కావడంతో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైపోయి.. దెబ్బ కొట్టేస్తోందన్న విమర్శ వుంది.

ఇదంతా ఓ యెత్తు.. నిర్మాతల కష్టాలు ఇంకో వైపు. రవితేజ, నిర్మాతల్ని ఏడిపిస్తాడనే మాట ఒకటి వుంది ఇండస్ట్రీలో. ఇదంతా గిట్టనివారు చేసే దుష్ప్రచారం అన్నమాట కూడా వుంది. ఏది నిజం.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

ఇంతకీ, ‘ఈగల్’ ఫెయిల్యూర్ నేపథ్యంలో రవితేజ ఏమన్నా నిర్మాతని ఆదుకుంటాడా.? ఓటీటీ దెబ్బ ఈ మధ్య చిన్నా పెద్దా.. అన్ని సినిమాలకీ గట్టిగానే పడుతోంది. ఈ దెబ్బ రవితేజ సినిమాలకి ఈ మధ్య ఇంకా బాగా పడిందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

దాంతో, తదుపరి సినిమాలకొచ్చేసరికి రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని రవితేజ తనంతట తానుగా డిసైడ్ అయ్యాడట. ఇప్పుడున్న రెమ్యునరేషన్‌లో కోత విధిస్తున్నట్టే విధించి, సినిమా హిట్టయితే, ఆ కోసేసిన అమౌంట్ ఇచ్చేయాలని ఓ చిన్న షరతు రవితేజ పెట్టాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.

రవితేజ మాత్రమే కాదు, చాలామంది హీరోలు.. ఈ మధ్య ఇలాంటి ప్రతిపాదనల్ని నిర్మాతల ముందుంచుతున్నారట.