మాస్ రాజా లెక్కలకు.. మూసుకొని అడిగినంత ఇచ్చేస్తున్నారు

Ravi Teja in Khiladi

మాస్ మహారాజా రవితేజ క్రాక్ దెబ్బకు ఒక్కసారిగా బాక్సాఫీస్ కు పట్టిన దుమ్మంతా ఎగిరిపోయింది. సినిమా భవిష్యత్తు ఏమవుతుందో అని అనుకుంటున్న తరుణంలో మాస్ రాజా ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు. అసలే 50% ఆక్యుపెన్సీలో కలెక్షన్స్ రావడం కష్టమని అనుకుంటున్న తరుణంలో క్రాక్ ఏకంగా 50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అంతకుముందు వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ అనుకున్నంత రేంజ్ లో అయితే లాభాలను ఇవ్వలేదు.

కానీ క్రాక్ మాత్రం బాక్సాఫీస్ ఎప్పటిలానే పటిష్టంగా ఉందని నీరూపించింది. అయితే మాస్ రాజా రెమ్యునరేషన్ పేరిగినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా నైజాం హక్కులను అందుకోవడంతో మాస్ రాజా చేతుల్లోకి 12కోట్లకు పైగా షేర్స్ వచ్చేశాయి. మొన్నటి వరకు రవితేజ ప్లాప్స్ లలో ఉండడంతో రెమ్యునరేషన్ ఇచ్చింది తీసుకోవాలని షరతులు పెట్టారు. కానీ ఇప్పుడు క్రాక్ దెబ్బకు అడిగినంత ఇచ్చేస్తున్నారు.

మాస్ రాజా కోసం ఆ ఇద్ద‌రు రెడీ?

 

ఇక రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో ఒక ఏరియా హక్కులను తీసుకోవాలని డిసైడ్ అవ్వగా నిర్మాతలు ఒప్పుకోవడం లేదట. ఎందుకంటే కేవలం 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచినప్పటికి మాస్ రాజా కలెక్షన్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. ఇక రానున్న రోజుల్లో హౌజ్ ఫుల్ అయితే లెక్క మరోలా ఉంటుందని ఆయన అడిగినంత 13కోట్ల వరకు ఇచ్చేస్తున్నారట. మరి రవితేజ రానున్న సినిమాలతో ఇదే స్థాయిలో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.