Ravi Teja : రావణాసురా గా మాస్ రాజా రవితేజ…సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా..!

Raviteja : మాస్ రాజా వరుసగా సినిమాల్లో చేస్తున్నారు క్రాక్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇక రీసెంట్ గా వచ్చిన కిలాడీతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ తో అభిమానుల అంచనాలు పెంచుతున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్టుతో రవితేజ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నాడు.

రావణాసురగా రవితేజ రాబోతున్నారు. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనేది ఉపశీర్షిక.ఇందులో పవర్ ఫుల్ లాయర్ గా మాస్ రాజా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నాగార్జున మేనల్లుడు సుశాంత్ నటిస్తున్నారు. రావణాసుర సినిమాలో ఐదు మండి హీరోయిన్స్ ఉన్నారు. మేఘ ఆకాష్,దక్షా నాగర్కర్ , అను ఇమ్మానుయేల్ , ఫైరా అబ్దుల్లా మరియు పూజిత పొన్నాడ నటిస్తున్నారు.

హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక సినిమాటోగ్రఫి మరియు ఎడిటింగ్ కు విజయ్ కార్తీక్ కన్నన్, శ్రీకాంత్ పనిచేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ ఆర్ టీ టీం ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను సెప్టెంబర్ 30 న ఈ ఏడాది విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.