రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను టార్చర్ పెడుతున్న హీరో?

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర మొదట డైరెక్టర్ గా పని చేసిన రవితేజ కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో కూడా నటించాడు. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమా ద్వారా హీరోగా మారాడు. ఈ సినిమాతో హీరోగా రవితేజకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో రవితేజ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇలా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇటీవల కూడా రవితేజ నటించిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆర్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై 29వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉండగా గతంలో రవితేజ రెమ్యూనరేషన్ గురించి చాలా వార్తలు వినిపించాయి. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ చాలా కరెక్ట్ గా ఉంటాడని, రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్న రవితేజ తన రెమ్యూనరేషన్ విషయం గురించి వస్తున్న రూమర్లపై స్పందిస్తూ సినిమా ప్లాప్ అయినప్పుడు నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి చెక్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా మరొకసారి రవితేజ రెమ్యూనరేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో కూడా రవితేజ చాలా మొండిగా ప్రవర్తించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంభందించిన కొన్ని సీన్లను రీషూట్ చేయడంతో, వాటికి ఎక్స్ ట్రా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రవితేజ ఈ విషయం గురించి స్పందిస్తూ ఈ సినిమాకు తనొక కో ప్రొడ్యూసర్ అని.. అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడినుండి వచ్చింది అంటూ ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో తన గురించి వచ్చే వార్తలలో నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు.