రవితేజనీ ఆ దోమ కుట్టిందట.!

రవితేజ అంటే మాస్ కా బాప్. అందుకే ఆయన్ని అంతా మాస్ రాజా రవితేజ అని పిలుస్తుంటారు. అయితే, ఈ మధ్య హీరోలంతా పీరియాడిక్ డ్రామాలపై ఫోకస్ పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ‘హరి హర వీరమల్లు’ కోసం పీరియాడిక్ డ్రామాపై మనసు మళ్లించుకున్న సంగతి తెలిసిందే. అలాగే, మన మాస్ రాజా రవితేజకీ పీరియాడిక్ డ్రామాపై మనసు మళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ నడుస్తుండడంతో ఆయన తదుపరి చిత్రం కోసం ఓ పీరియాడిక్ డ్రామాని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రాబోతోందని సమాచారం. ఆ సినిమాని పీరియాడిక్ నేపథ్యంలో రూపొందించనున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఈ మధ్య రవితేజ తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి కొంతమేర నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నాడు.

హరీష్‌తో చేయబోయే ఈ చిత్రానికి రవితేజ నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడనీ అంటున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని రూపొందించబోతున్నారట. అన్నట్లు హరీష్ శంకర్ డైరెక్టర్‌గా పరిచయమైంది రవితేజ సినిమా (షాక్) తోనే .