HomeEntertainmentసుమది వెటకారమట.. రవితేజ కామెంట్స్ వైరల్

సుమది వెటకారమట.. రవితేజ కామెంట్స్ వైరల్

యాంకర్ సుమ స్టేజ్ మీదకు ఎక్కితే ఆమె మాటల ప్రవాహాన్ని, ఆ ధాటిని తట్టుకోగల, అడ్డుకోగల సామర్థ్యం ఎవ్వరికీ లేదు. అసలే కరోనా సమయం, లాక్డౌన్ కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేక సుమ గొంతు అంతగా వినబడలేదు. నిన్న క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమ మళ్లీ తన సందడిని మొదలుపెట్టింది. అప్పుడెప్పుడో మార్చి 8న చివరి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినట్టుగా గుర్తుందంటూ సుమ నాటి విషయాలను గుర్తుకు చేసుకుంది.

మొత్తానికి ఇన్ని రోజులకు మళ్లీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని సుమ కామెంట్ చేసింది. క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్తానికి మళ్లీ దాదాపు పది నెలల తరువాత స్టేజ్ మీదకు ఎక్కి దుమ్ములేపింది. ఇదే విషయాన్ని రవితేజ కూడా ప్రస్తావించాడు. రవితేజ స్టేజ్ మీదకు ఎక్కి మొదటగా సుమ గురించే చెప్పాడంటే మామూలు విషయం కాదు.

Ravi Teja Comments On Suma In Krack Event
ravi teja comments on Suma In Krack Event

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా రవితేజ మాట్లాడుతూ.. సుమ గురించి చెప్పాడు. సుమ ఇలా మాట్లాడక? నిన్ను ఇలా చూడక ఎన్ని రోజులు అవుతోంది.. ఏడాది గడిచిపోయిది.. నీ వెటకారం మిస్ అయ్యామంటూ రవితేజ కామెంట్ చేయడంతో అందరూ నవ్వేశారు. మరి సుమ రేంజ్ అంటే అదే. ఎంతటి స్టార్ హీరో అయినా సరే సుమ పంచ్ వేస్తే నవ్వాల్సిందే.. సుమకు సైడ్ ఇవ్వాల్సిందే. అలా సుమ ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి బిజీ అయ్యేలా ఉంది.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News