బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి యాంకర్ రవి ఎవరూ ఊహించని విధంగా 12వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవి ఇలా ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అభిమానులు అన్నపూర్ణ స్టూడియో ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు.
ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం లోపల జరిగేది ఒకటి బయటకు ప్రాజెక్ట్ అయ్యేది ఒకటి అంటూ తెలిపారు. లోపల జరిగే సన్నివేశాలను చాలావరకు బయట చూపించడం లేదని దీంతో లోపల జరిగేది ఒకటైతే అభిమానులకు, ప్రేక్షకులకు చేరేది మరొకటి కావటం వల్ల ఇలా ఎలిమినేషన్ జరుగుతుందని తెలిపారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ప్రతి ఒక కంటెస్టెంట్స్ బయట వారి గురించి ప్రమోట్ చేయమని డబ్బులు ఇవ్వడం సర్వసాధారణం. నేను కూడా తన గురించి ప్రమోట్ చేయమని డబ్బులు ఇచ్చాను. అలాగే హౌస్ లోకి వెళ్లే ముందు ఎవరైనా తన గురించి కామెంట్ చేయాలనుకుంటే తనని మాత్రమే కామెంట్ చేయాలని ఇంటిలో వారిని ఎలాంటి కామెంట్ చేయకూడదని హెచ్చరించి వెళ్లానని తెలిపారు. కానీ కొందరు డబ్బు కోసం తన భార్యను కూడా దారుణంగా కామెంట్స్ చేశారని, కేవలం తన భార్యను మాత్రమే కాకుండా తన కూతురు కూడా కామెంట్ చేయడంతో రవి ఎమోషనల్ అయ్యారు. ఒక బ్యాచ్ ఉంది రెండు వేల రూపాయలు ఇస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా దారుణంగా కామెంట్లు చేస్తారు అంటూ రవి ఎమోషనల్ అయ్యారు.