Pavan kalyan : పవన్ సినిమాలో రవీనా టండన్… హరీష్ శంకర్ సినిమాలో కీలక పాత్ర..!

Pavan kalyan : వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. హరి హర వీర మల్లు పీరియడిక్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ బందిపోటు వీర మల్లు గా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో రాకుమారిగా నటిస్తోంది. రాబిన్ హుడ్ లాంటి స్టోరీ తో సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.

ఇక ఈ సినిమా తరువాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ హెగ్డే పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం రవీనా టండన్ ను తీసుకుంటున్నారట. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 లో ప్రధాన మంత్రి రమిక సేన పాత్రలో అదరగొట్టిన రవీనా ను కీలక పాత్రకోసం తీసుకున్నట్లు సమాచారం.

రవీనా టండన్ తెలుగు సినీ పరిశ్రమకు కొత్త కాదు. హీరోయిన్ గా ఆకాశ వీధిలో, బంగారు బుల్లోడు, రథ సారధి సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ద్వారా మళ్ళీ బాగా బిజీ అయిపోయారు రవీనా.