ఎలుగుబంటి ప‌ట్ల కర్క‌మైన ప్ర‌వ‌ర్త‌న‌.. మండిప‌డ్డ కేజీఎఫ్ 2 న‌టి

మ‌నుషుల‌లో రానురాను మాన‌వ‌త్వం చ‌నిపోతుంది. మూగ‌జీవాలు అన్న విష‌యాన్ని కూడా మ‌ర‌చిపోయి వాటిప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు కొంద‌రు మూర్ఖులు. ఈ సంఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రిని ఎంతో క‌ల‌చివేస్తుండ‌గా, సెల‌బ్రిటీలు వారిలో మార్పు తీసుకొచ్చేందుకు చాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయిన‌ప్పటికీ కొంద‌రు అలానే ప్ర‌వ‌ర్తిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

తాజాగా కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో ఎలుగుబంటిని కొంద‌రు జీప్‌తో వెంబ‌డించారు. అది ప్రాణ‌భ‌యంతో అలానే ప‌రుగెత్తుతుండ‌డంతో వారు కూడా అలానే తరుముకుంటూ వెళ్ళారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుండ‌డంతో దీనిపై బాలీవుడ్ న‌టి, కేజీఎఫ్ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించిన ర‌వీనా టాండ‌న్ స్పందించారు. ఆట‌విక నిర‌క్ష్య‌రాసులు.. దానిపై జాలి చూపించి కారు కూడా ఆప‌లేదు. మీరు వాటి స్థ‌లానికి వెళ్లి జాలి చూప‌కండా ఇలా రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ రవీనా త‌న కామెంట్ లో పేర్కొంది.

న‌టిగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ర‌వీనా టాండ‌న్‌లో మాన‌వ‌త్వం చాలా ఉంది. సున్నిత‌మైన అంశాల‌పై ఎప్పుడు చురుకుగా స్పందించే ర‌వీనా టాండ‌న్ ఈ సారి ఎలుగుబంటిని వెంబ‌డించిన వారిపై గ‌ట్టిగానే ఫైర్ అయింది. ర‌వీనాకు మ‌ద్దతుగా నెటిజ‌న్స్ కూడా జీపులో ప్ర‌యాణించే వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ర‌వీనాటాండ‌న్ న‌టించిన కేజీఎఫ్ 2 చిత్రం జూలై 16న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా ఇందులో య‌ష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ మున్నాభాయ్ సంజ‌య్ ద‌త్ అధీరా అనే పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నారు.