రావణాసుర కలెక్షన్స్.. ఈ టాక్ తో కష్టమే?

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ రావణాసుర బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ టాక్ ఏమి అందుకోలేదు. అభిషేక్ నామా, RT వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కథను శ్రీకాంత్ విస్సా అంధించగా టాలెంటెడ్ యువ దర్శకుడు సుధీర్ వర్మ సినిమాను డైరెక్ట్ చేశాడు.

అయితే సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివ్ టాక్ గట్టిగానే అందుకుంది. రివ్యూల పరంగా సినిమా అంత పాజిటివ్ టాక్ అందుకోలేక పోయింది. అయితే మాస్ రాజా క్రేజ్ కారణంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి.

ఇక సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లోకి వెళితే ఆంద్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ డే టోటల్ గా 4.29 కోట్ల షేర్, 6.70 కోట్ల గ్రాస్ దక్కింది. ఇక కర్నాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 26 లక్షలు, ఓవర్సీస్ లో 30 లక్షలు వచ్చాయి. టోటల్ గా రావణాసుర సినిమా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.85 కోట్ల షేర్, 7.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక ఈ సినిమా టోటల్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 22.20 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ 23 కోట్లకు సెట్ అయ్యింది. సినిమా సక్సెస్ కావాలి అంటే ఇంకా 18.15 కోట్లు రాబట్టాలి. ఇక రావణాసుర సినిమా ఈ వీకెండ్ లోనే వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలి. మరి ఈ సినిమా టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.