సినిమా టాక్‌తో సంబంధం లేకుండా 100 కోట్ల పోస్టర్స్ దింపేయడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఓ మోస్తరు హిట్ టాక్ వచ్చినా సరే, ఇంకేముంది బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఆ తర్వాత వెంటనే 100 కోట్ల పోస్టర్ దించేస్తున్నారు. అభిమానులు వాటిని ట్రెండింగ్ చేయడం చేస్తున్నారు. తాజాగా మాస్ రాజా రవితేజ సినిమాకీ ఇదే పరిస్థితి.
ఇది ఇంకా దారుణం. ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే, ప్రేక్షకుల మౌత్ టాక్‌లో పడకుండానే 100 కోట్ల బొమ్మ.. అంటూ పోస్టర్ సిద్ధం చేసేశారట చిత్ర బృందం. మరోవైపు రవితేజ ఫ్యాన్స్.. ఇంకో స్టెప్ ముందుకేసి, ‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ హిట్స్. ఇక రానున్న ‘రావణాసుర’ హ్యాట్రిక్ హిట్.. పక్కా 100 కోట్ల బంపర్ హిట్.. అంటూ బ్యానర్లు సిద్ధం చేసేశారట.
రీసెంట్గా నాని సినిమా ‘దసరా’ విషయంలోనూ ఇదే జరిగింది. ఓ వర్గం ప్రేక్షకులు ‘దసరా’కి అంత సీను లేదంటూ పెదవి విరిచేసినా.. ట్రెండ్ ఫాలో చేయాలి కాబట్టి.. అన్నట్లుగా అనూహ్యంగా దిగిపోయిన 100 కోట్ల బ్యానర్‌కి జై కొట్టాల్సి వచ్చింది. చూశాం కదా. తప్పలేదు.!