Rashmika: రణబీర్ కపూర్ ‘అనిమల్ ‘సినిమా లో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!

Rashmika: రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ గా బాగా పాపులర్. ఈ కన్నడ ముద్దు గుమ్మా ఛలో సినిమా తో నాగశౌర్యా సరసన నటించి ఈ సినిమా విజయం తో వెను తిరిగి చూసుకునే పనిలేకుండా అయింది. తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా తో నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో టాప్ హీరోయిన్ అయిపోయింది.రీసెంట్ గా వచ్చిన పుష్ప తో ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ డమ్ పెంచుకుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం రష్మిక బాలీవుడ్ లో రణబీర్ పక్కన నటించే అవకాశం కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే రష్మిక సంప్రదించినట్టు సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‏బీర్ కపూర్ ప్రధాన పాత్రలో యానిమల్ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‏గా ఎంపికైందట. మొదట ఈ మూవీలో పరిణీతి చోప్రా నటించాల్సి ఉంది.. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రష్మికను సెలక్ట్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రణ్‏బీర్ భార్య పాత్రలో రష్మిక కనిపించనుంది.