Samantha -Rashmika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్నటువంటి సమంత, రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వీరిద్దరు సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుని దూసుకుపోతున్నారు. ఈ విధంగా తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్లుగా గుర్తింపు పొందిన వీరికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే సమంత విడాకుల తర్వాత నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే పలు సార్లు సమంత సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురైంది.ఈ క్రమంలోనే ఎంతో సహనంతో వాటిని భరించిన సమంత చివరికి ఓపిక నశించి ట్విట్టర్ ద్వారా ట్రోలర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మౌనంగా ఉన్నానంటే అర్థం అన్ని అంగీకరించానని కాదు…నా మంచితనం బలహీనత అయితే ఆ బలహీనతకు ఏదో ఒకరోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంటూ సమంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నటి రష్మిక ట్వీట్ పై స్పందిస్తూ పవర్ వర్డ్స్ అంటూ word అని రాసి పక్కన పవర్ అనే ఎమోజి షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సమంత అభిమానులు తనకు మద్దతుగా నిలబడినందుకు రష్మిక కు థాంక్స్ చెప్పారు. అయితే మరికొందరు మాత్రం వీరిద్దరిపై భారీగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయినా మీరు ఇద్దరూ ఒకటే కదా… ఇద్దరూ కలిసి నాగచైతన్య, రక్షిత్ కి అన్యాయం చేశారు. వారిద్దరిని పిచ్చోళ్లను చేశారు. వినే వాళ్ళు ఉంటే మీరు ఎన్ని అయినా చెబుతారు అంటూ సమంత రష్మిక పై భారీగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.