రష్మిక తగ్గించిందా.? సమంత పెంచిందా.?

నేషనల్ క్రష్ రష్మిక మండన్నా తాజాగా ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ‘రెయిన్ బో’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఓ కొత్త డైరెక్టర్ ఇండస్ర్టీకి పరిచయమవుతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే, ఇదో ప్రెస్టీజియస్ మూవీ. హీరోయిన్ సెంట్రిక్ మూవీ. మొదట ఈ సినిమాకి సమంతను అనుకున్నారట. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, ఆ ప్లేస్‌లోకి రష్మిక వచ్చి చేరింది. సమంతతో పోల్చితే రష్మికకు క్రేజ్ ఎక్కువ. నేషనల్ క్రష్ కదా.

ప్యాన్ ఇండియా వైజ్ రష్మికకు డిమాండ్ వుంది. అంతేకాదు, రెమ్యునరేషన్ విషయంలోనూ రష్మిక మండన్నా టాప్‌లో వుంది. అయితే, సమంత ఈ ప్రాజెక్ట్ ఎందుకు నో చెప్పింది.? రష్మిక ఎందుకు సై అనేసింది. ఒకవేళ రెమ్యునరేషన్ విషయంలోనే తక్కువ ఎక్కువలు ఏమైనా అయ్యాయా.? అనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం సమంత రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందనీ, రష్మిక తనకున్న క్రేజ్‌ని సైతం పక్కన పెట్టేసి రెమ్యునరేషన్ తగ్గించిందనీ అందుకే రష్మికను ఓకే చేశారనీ మాట్లాడుకుంటున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ‘రెయిన్‌బో’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రష్మిక కెరీర్‌లోనే ఇదో బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి.