ఈరోజు నాకు చాలా విలువైనది .. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రష్మిక.

గత ఐదు సంవత్సరాల నుంచి పుష్ప టీం తో కలిసి పని చేసిన రష్మిక మందన్న గత నవంబర్ 25 న తన ఆఖరి రోజు షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా టీం తో ఎన్ని సంవత్సరాలుగా తాను గడిపిన క్షణాలని తలుచుకొని ఎమోషనల్ అయింది. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. పుష్ప సినిమాకు సంబంధించి నాకు అదే చివరి రోజు అని తెలిసినప్పటికీ నాకు అలా అనిపించలేదు.

ఎందుకనేది ఎలా చెప్పాలో తెలియడం లేదు నా 7,8 ఏళ్ల సినీ కెరియర్ లో గత ఐదు సంవత్సరాలు దాదాపు ఈ సినిమా సెట్ లోనే గడిచిపోయాయి. ఈ సినిమా తో ఎంతో అలసిపోయాను అదే సమయంలో ఎంతో గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయటం, మనకు తెలియకుండానే వారితో అనుబంధం ఏర్పడటం క్రేజీగా ఉంది. ఇలాంటి సమయంలోనే షూటింగ్ అయిపోయిందంటే చాలా బాధగా ఉంది, ఈరోజు నాకు చాలా విలువైనది అంటూ భావోద్వేగానికి లోనైంది.

పుష్ప టీం తో నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడింది అని చెప్పుకొచ్చిన రష్మిక మరొక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ని కూడా ఫ్యాన్స్ కి అందించింది. అదేమిటంటే ఎప్పటినుంచో పుష్ప 3 పై అనేక రూమర్స్ వస్తున్నాయి పుష్ప 2 కి కొనసాగింపు ఉంటుందని కొందరు అంటుంటే పుష్ప 2 తో సినిమా ముగుస్తుందని కొందరు అంటున్నారు. అయితే ఈ విషయంపై అటు అల్లు అర్జున్ గాని సుకుమార్ గానీ మూవీ మేకర్స్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ రష్మిక క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది బహుశా పార్ట్-3 కూడా ఉంటుందని రష్మిక మందన్న అన్నారు. అయితే సినీ విమర్శకులు పుష్ప 3అనేది పుష్ప 2 యొక్క సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా కధ ముగింపును బట్టి పుష్ప 3 ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది అంటున్నారు. మరి పుష్ప 3 పై మూవీ టీం ఎలాంటి అప్డేట్ ఇస్తుందో చూడాలి.