రష్మిక మందాన్నకు ఓ చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ మధ్య తెగ సెటైర్లు వచ్చాయి. రష్మిక మందాన్న ఏజ్‌కు, తన చెల్లి ఏజ్‌కు మధ్య అంత గ్యాప్ ఉండటంతో అందరూ సెటైర్లు వేశారు. అయితే అవన్నీ పక్కన పెడితే మాత్రం రష్మిక తన చెల్లితో కలిసి ఎన్నో ఆటలు ఆడుతుంది. అలా చేయడం వల్లే రష్మిక కూడా ఇంకా చిన్న పిల్లలానే సోషల్ మీడియాలో అల్లరి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
రష్మిక మందాన్న తన చెల్లితో లాక్డౌన్‌లో ఎంత అల్లరి చేసిందో అందరికీ తెలిసిందే. ఎన్నో రకాలుగా చెల్లిని ఆట పట్టించింది. ఆ వీడియోలు కూడా ఎంతగానో వైరల్ అయ్యాయి. అలా రోడ్డుపై చెల్లి కోసం వాకింగ్ కూడా వెళ్లేది. ఇక వీకెండ్స్ వస్తే తామంతా ఇంట్లోఎలా అల్లరి చేస్తామో.. ఎలా ఉంటాయో వంటి సంగతులన్నీ కూడా చెప్పింది. షూటింగ్‌లకు బయటకు వెళ్లిన క్షణంలో చెల్లిని బాగా మిస్ అవుతాను అని రష్మిక ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
తాజాగా కూడా రష్మిక కాస్త ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. తన చిట్టి చెల్లిని ఎత్తుకుని ఆటలు ఆడినట్టుంది. ఈ మధ్య రష్మిక అసలు ఇంట్లోనే ఉండటం లేదు. హైద్రాబాద్, చెన్నై అంటూ తిరుగుతూనే ఉంటోంది. ఓ వైపు వర్కవుట్లు, మరో వైపు సినిమాలు ఇలా మొత్తంగా బిజీగా ఉండటంతో చెల్లిని బాగా మిస్ అవుతోన్నట్టుంది. నేను నిన్ను చాలా చాలా మిస్ అయ్యాను.. నువ్ నా కుందేలు అంటూ ఓ ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక తన చెల్లిని ఎత్తుకున్న ఫోటో తెగ వైరల్ అవుతోంది.