Pushap 3: పుష్ప 3 లో విజయ్ దేవరకొండ… అసలు విషయం బయటపెట్టిన రష్మిక మందన్నా?

Pushap 3: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా హవా కొనసాగుతోంది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే ఏకంగా 1300 వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక భారీ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 3 కూడా ఉండబోతుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు అయితే క్లైమాక్స్ లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరినీ కూడా బాంబుతో పేల్చేస్తూ ఒక వ్యక్తి కనిపిస్తారు. కానీ ఆయన ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు కానీ తన వేషధారణ చూస్తే మాత్రం అక్కడ విజయ్ దేవరకొండ అంటూ అభిమానులు భావిస్తున్నారు.

గతంలో విజయ్ దేవరకొండ పుష్ప 3 గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా సినిమా టైటిల్ గురించి కూడా ఒక పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా పార్ట్ 2 లో చివరిలో అచ్చం విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి కనిపించడంతో ఈయన మూడవ భాగంలో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పాల్గొన్న రష్మికకు ప్రశ్న ఎదురయింది.

ఇక ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ విషయంలో నాకు సినిమా యూనిట్ నుంచి ఏ విధమైనటువంటి సమాచారం లేదని తెలిపారు..తాను కూడా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ వార్తను వింటున్నానని చెప్పారు. అయితే సుకుమార్ గారికి ట్విస్ట్ ఇవ్వడం అలవాటే కాబట్టి అతను ఉంటే ఉండొచ్చు అనే ధోరణిలో మాట్లాడారు.

ఇలా రష్మిక విజయ్ దేవరకొండ పాత్ర గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కచ్చితంగా పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారని ఇదే కనుక నిజమైతే ఈసారి మరో సంచలనమైన రికార్డు నమోదు కావడం గమనార్హం అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడప్పుడే పుష్ప 3 వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవనే తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరూ కూడా ఇతరులతో కొత్త సినిమాలకు కమిట్ అయ్యారు కనుక ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాతనే పుష్ప 3 గురించి ఆలోచన చేయబోతున్నారని తెలుస్తోంది.