చిరంజీవితో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోనుందా.?

ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. ఆ మధ్య తమిళ హీరో విజయ్ సరసన ‘వారసుడు’ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు రష్మిక చెప్పిన మాట.! తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలన్నదీ రష్మిక డ్రీమ్.

ఎప్పుడు చిరంజీవిని కలిసినా రష్మిక, ‘ఫ్యాన్ గర్ల్’లా మారిపోతుంటుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావొచ్చు, మరో సందర్భంలో కావొచ్చు.. చిరంజీవి అంటే అమితమైన అభిమానం ప్రదర్శించింది రష్మిక.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే చిరంజీవితో రష్మిక ఓ సినిమాలో కాస్సేపు స్క్రీన్ షేర్ చేసుకోనుందట. అదీ ఓ పాటలో.. అది కూడా కాస్సేపేనట.! ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా కోసమా.? లేదంటే, తదుపరి సినిమా కోసమా.? రష్మిక కనిపించేది.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.