రష్మిక తర్వాతే ఎవరైనా.!

ఎడా పెడా సినిమాలు చేసేస్తోంది శ్రీలీల.! అయినాగానీ, స్టార్‌డమ్ పరంగా చూసుకుంటే, రష్మికనే ఇంకా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పూజా హెగ్దేకి వరుస ఫ్లాపులు రావడం రష్మికకి కలిసొచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఎవరు.? అంటే, కుండబద్దలుగొట్టి మరీ రష్మిక మండన్న పేరు చెప్పాల్సిందే.

తాజాగా, ఓ కొత్త ప్రాజెక్టు కోసం రికార్డు స్థాయి పేమెంట్ అందుకోబోతోంది రష్మిక మండన్న. పైగా, అది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది లెండి.! సదరు నిర్మాణ సంస్థ, కాస్త తొందరపడి రష్మికకి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రష్మిక ఆ పాత్రలో కష్టమే.. అన్న చర్చ కూడా నడుస్తోందనుకోండి.. అది వేరే విషయం.

పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడంలో రష్మిక రూటే సెపరేటు. అందుకే, రేటు అంత గట్టిగా పలికింది.