రష్మిక మందాన్న గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తోంది. వర్కవుట్లతో ఒక్కొక్కరికి పిచ్చెక్కిస్తోంది. బీచ్‌లో మొదటి సారి వర్కౌట్లు చేస్తున్నా అంటూ ఆ అనుభూతి చెప్పలేనని ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇసుకలో రన్నింగ్ చేస్తూ.. వెరైటీ వెరైటీ వర్కౌట్లు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇలా రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది.
లాక్ డౌన్‌లో రష్మిక చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ అల్లరితో పాటే తండ్రిపై ఓ కవిత్తం, కుటుంబం గురించి గొప్పగా చెబుతూ తనలోని రచయిత్రిని బయటకు తీసుకొచ్చింది. మరోసారి తన ఫ్యామిలీ సండే వస్తే ఎలా ఉంటామో ఓ ఫన్నీ ఫోటోతో చెప్పేసింది. ఓ మూడు పందులు ఒకే చోట ఉన్నాయి. అందులో ఓ రెండు ఒకదానిపై ఒకటి పడుకుని ఉన్నాయి. ఆదివారం వస్తే మా ఇంట్లోనూ పరిస్థితి ఇలానే ఉంటుందని రష్మిక చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది.
అయితే రష్మిక తాజాగా ఓ పోస్ట్ చేసింది. అందులో రష్మిక ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అందులో బాగా తిన్న తరువాత రష్మిక ఏదో తాగుతోంది. ఆ ఫోటో చూస్తుంటే రష్మిక మద్యం తాగుతోందోమోనన్న అనుమానం వస్తుంది. నాన్ స్టాప్‌గా తాగేస్తోందని ఆమెతో ఉన్న వ్యక్తి ఫోటో తీసి క్యాప్షన్ పెట్టేసింది. మరి నిజంగానే మద్యం తాగుతుందో .. లేదా బిల్డప్ కోసం థమ్సప్ లాంటిది ఏదైనా అందులో పోసుకుని పోజిచ్చిందేమో తెలియదు. అదంతా పక్కన పెడితే తాజాగా రష్మిక ఓ షూటింగ్‌లో పాల్గొంది. తమిళంలో మొదటి చిత్రం కావడం, ఆ షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవడంతో రష్మిక ఎంతో సంతోషించింది. కార్తీ సరసన సుల్తాన్ అనే చిత్రంతో రష్మిక నటించింది.