తూచ్.! రష్మిక కాదంట.!

రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కొన్ని తెలుగు ప్రాజెక్టుల విషయంలో రష్మిక మండన్నా పేరు వినిపిస్తోంది.

కొత్తగా కొన్ని ప్రాజెక్టులపై రష్మిక సైన్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, తాను ఏ కొత్త ప్రాజెక్టుకీ సైన్ చేయలేదని రష్మిక తాజాగా వెల్లడించింది.

అంటే దీనర్ధం.. ఇంతవరకూ వస్తున్న ప్రచారంలో నిజం లేదు. అంతా హంభక్కే అని స్పష్టత వచ్చేసింది. మాస్ రాజా రవితేజ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ అంటూ ఈ మధ్య ఓ ప్రచారం జోరుగా వినిపించింది.

వెనకా ముందూ చూడకుండా. పలు మీడియా సంస్థలు వేడి వేడిగా ఈ కాంబోపై కథనాలు వండి వడ్డించేశారు. అయితే, రష్మిక వెంటనే రెస్పాండ్ అయ్యింది. అలాంటిదేం లేదని తేల్చేసింది.

బాలీవుడ్‌లో ‘యానిమల్’ సినిమా రష్మికకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అలాగే తెలుగులో ‘ఫుష్ప 2’ కూడా. ఈ రెండూ భారీ ప్రాజెక్టులు ఆమెకి. పది సినిమాలు చేసినా కూడా రానంత ఫేమ్ ఈ రెండు సినిమాలతో రష్మిక దక్కించేసుకోగలదు రిజల్ట్ అనుకున్న విధంగా వస్తే.

ఆ రేంజ్ హై ఎక్స్‌పెక్టేషన్ మూవీస్ ఇవి. ఇకపోతే, రవితేజ సినిమా విషయానికి వస్తే, మొదట శ్రీలీల అన్నారు. ఆ తర్వాత రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కాకపోతే మరింకెవరు.? మృణాల్ పేరు పరిశీలనలో వుంది. మీనాక్షి కూడా రేస్‌లో వుంది.

అయితే, వీళ్లెవరూ కాదు.. ఓ తెలుగమ్మాయ్ అయితే బావుంటుందని అనుకుంటున్నారట. చూడాలి మరి ఎవరు ఫిక్స్ అవుతారో.!