Rashmika: అల్లు అర్జున్ దమ్మున్నోడు… ఏ హీరో కూడా అలా చేయలేరు.. ప్రశంసలు కురిపించిన రష్మిక!

Rashmika: అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీ విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇక ఈ సినిమా విడుదలైన వారం రోజులకి ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఇలాంటి రికార్డు సృష్టించిన తొలి సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా కూడా పది రోజులలో 1000 కోట్లు కలెక్షన్లను రాబట్టగా పుష్ప 2 మాత్రం వారం రోజులలోనే వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి మరో కొత్త రికార్డు సాధించింది. ఇక ఈ సినిమా ఇప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్లతో దూసుకుపోతోంది మరోవైపు సెలబ్రిటీలకు కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు అల్లు అర్జున్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈమె జాతర సన్నివేశం గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.ఇంత బాగా ఈ సీన్ చేయగలిగిన ఏకైక నటుడు అల్లు అర్జున్ సర్ మాత్రమే.

నా జీవితంలో మళ్లీ ఇలాంటి సీక్వెన్స్ చూస్తానని అనుకోవడం లేదు. అసలు ఇంత దమ్ము, పవర్, ఆల్ఫానెస్ ఉన్న హీరో ఓ చీర కట్టుకొని, చీరలోనే డ్యాన్స్ చేసి, ఆ చీరలోనే యాక్షన్ సీక్వెన్సెస్ చేసి, చీరలోనే డైలాగ్స్ చెబితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సినిమాలో 21 నిమిషాల పాటు అతడు చీర కట్టుకొనే కనిపిస్తాడు. అసలు ఏ మగాడు ఆ పని చేయగలడో చెప్పండి. అతన్ని నేను ఎంతో గౌరవిస్తాను. ఆరాధిస్తాను. జీవితం మొత్తం తనని సపోర్ట్ చేస్తూ ఉంటాను అంటూ ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.