తన చలాకీతనంతో ప్రేక్షకులనే కాదు చుట్టు పక్కల వారిని కూడా తెగ నవ్వించే సత్తా ఉన్న నటుడు రణ్‌వీర్ సింగ్. చూడ్డానికి చాలా స్టైలిష్‌గా కనిపించే ఈ హీరో వేడుకలలో చేసే రచ్చకు అంతా షాక్ అవుతుంటారు. రణ్‌వీర్ సింగ్ ఉన్నాడంటే అక్కడ సందడి మాములుగా ఉండదు. తోటి సెలబ్రిటీలను తెగ ఆటపట్టిస్తూ ఉంటాడు. ఇక నటన విషయానికి వస్తే ఆస్కార్ రేంజ్‌లో నటించి ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ ఉంటారు. కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైన సరే ఆ పాత్రలో జీవించడం రణ్‌వీర్ సింగ్‌కు వెన్నతో పెట్టిన విద్య.
కరోనాతో ప్రకటించన లాక్‌డౌన్ వలన దాదాపు 8 నెలల నుండి ఇంటికే పరిమితమై ఉన్నాడు రణ్‌వీర్ సింగ్. ఆ మధ్య రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణే భర్త గురించి మాట్లాడుతూ 12 గంటలకు పైగా నిద్రబోతున్నాడు. కేవలం తినే సమయంలో మాత్రమే మేల్కొంటున్నాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ అమ్మడు తన భర్త కోసం స్పెషల్ వంటకాలు నేర్చుకొని వండి పెట్టింది. చూడముచ్చటగా ఉండే రణ్‌వీర్ సింగ్ , దీపికా పదుకొణే జంట లాక్ డౌన్ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నారు. దీపిక వంటలు నేర్చుకోవడంపై దృష్టి పెడితే, రణ్‌వీర్ సింగ్ బాడీ షేపింగ్‌పై కాన్సన్‌ట్రేట్ చేశాడు.
లాక్ డౌన్ వలన చాలా సమయం దొరకడంతో తన శరీరాకృతిని మార్చే విషయంపై పూర్తి దృష్టి పెట్టాడు రణ్‌వీర్ సింగ్. జిమ్‌కే ఎక్కువ పరిమితమైన ఈ హీరో అందరు ఆశ్చర్యపోయేలా మారాడు. ఇతని శరీర ధారుడ్యం చూసి టైగర్ ష్రాఫ్ కూడా స్టన్ అయ్యాడంటే తన బాడీని ఎంతలా మార్చుకున్నాడో అర్ధమవుతుంది.కండలు తిరిగిన దేహంతో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న రణ్‌వీర్‌ని చూసి అమ్మాయిలకి కంటికి కునుకు లేకుండా పోతుంది. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా న్యూ లుక్‌లో కనిపిస్తున్న రణ్‌వీర్‌ని చూసి వావ్ అంటున్నారు