గుణశేఖర్ తో తలనొప్పి లేకుండా.. రానా ప్లాన్

దగ్గుపాటి రానా ఎప్పటినుంచో హిరణ్యకశిపా ప్రాజెక్టు చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అసలైతే మొదట గుణశేఖర్ ఈ పాయింట్ తో కథను చేయాలని అనుకున్నాడు. ఇక అతను కథపై కసరత్తులు చేస్తున్న సమయంలోనే రానా దగ్గుపాటి ఈ ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తాను డైలాగ్స్ రాస్తాను అని గుణశేఖర్ కు మాట కూడా ఇచ్చాడు.

అయితే ఆ తర్వాత ఊహించిన విధంగా ఈ ప్రాజెక్టు అనేక మలుపులు తిరిగింది. రానా దగ్గుబాటి ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను ప్రజెంట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. అయితే గుణశేఖర్ని మాత్రం మెల్లగా ప్రాజెక్టు నుంచి తప్పించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రీసెంట్ గా అమెరికాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వచ్చిన తర్వాత గుణశేఖర్ కాస్త హర్ట్ అయినట్లుగా ట్వీట్ కూడా చేశాడు.

అయితే గుణశేఖర్ కు అసలు ఏమాత్రం చాన్స్ ఇవ్వకుండా రానా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథలను ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెరపైకి తీసుకురావచ్చు. ఒక్కొక్కరు ఒక్క కోణంలో ప్రజెంట్ చేస్తారు కాబట్టి స్క్రిప్టు సొంతంగా మరొక రూపంలో ఉంటే సరిపోతుంది. అయితే గుణశేఖర్ ఈ కథకు కరెక్ట్ కాదు అని రానా నిర్ణయం తీసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ మాత్రం స్క్రిప్ట్ అందించడానికి సిద్ధమయ్యాడు.

అయితే ఈ హిరణ్యకశిప అసలు కథ మాత్రం. అమర్ చిత్రం కథకు సంబంధించినది అని తెలుస్తోంది. అమర్ చిత్ర కథ.. ‘ప్రహ్లాద’ పేరుతో ఓ కథను కామిక్ బుక్ రూపంలో 1973లో పబ్లిష్ చేసింది. ఆ కథకు ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ కథ రైట్స్ తీసుకుని దాన్నే సినిమాగా తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నాడు. అంటే గుణశేఖర్ పాయింట్ ను ఈ మాత్రం టచ్ చేయడం లేదన్నమాట. ఇక ఆ కథకు త్రివిక్రమ్ కూడా తోడుకాబోతున్నాడు. అయితే దర్శకుడు ఎవరు అనేది ఫిక్స్ కాలేదు. మొత్తానికి గుణశేఖర్ తో ఇబ్బందులు లేకుండా ఆయన ప్రస్తావన లేకుండానే రానా ఈ తరహాలో ముందుకు వెళుతున్నాడు.