పవన్‌తో రానా ఫైట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

రానా దగ్గుబాటి బాహుబలి అనంతరం మరో హీరోతో ఫైట్ చేయలేదు. ఇక చాలా కాలం తరువాత పవర్ స్టార్ లాంటి హీరోతో సరికొత్త యుద్ధం చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ ఇటీవల సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో పనులను కూడా మొదలు పెట్టారు.

ఒరిజినల్ కథలో పోలిసాఫీసర్ గా కనిపించిన బిజూ మీనన్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. మాజీ ఆర్మీ అధికారిగా పృథ్వి రాజ్ చేసిన పాత్రలో రానా నటించనున్నాడు. ఈ కాంబినేషన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో రానా, పవన్ మధ్య ఫైట్ సీన్స్ కూడా చాలానే ఉంటాయట. అయితే రానా ఈ పాత్ర చేయడానికి తీసుకున్న రెమ్యునరేషన్ పై కొన్ని రూమర్స్ వస్తున్నాయి.

రానా ఈ రీమేక్ కోసం రూ.6కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. చాలా సన్నివేశాల్లో పవన్, రానా మధ్య హై వోల్టేజ్ డ్రామా నడుస్తుందట. ఇక ఫైట్స్ లలో ఇద్దరు కొట్టుకోవాల్సి ఉంటుంది. మరి అభిమానులు ఆ సీన్స్ ను ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమాను మూడు నెలల్లోగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.