లేటెస్ట్ : రజినీ సినిమాలో రాణాకి బంపరాఫర్..!

తమిళ సినిమా నాట బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అనే చెప్పాలి. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ చిత్రం జైలర్ తో సెన్సేషల్ సక్సెస్ ని అందుకోగా..

ఈ సినిమా అనంతరం రజిని తన కెరీర్ లో 170వ సినిమాని ఇప్పుడు చేస్తున్నారు. మరి ఈ భారీ సినిమాని మేకర్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ సినిమాలో గ్రాండ్ తారాగణం నటిస్తుండగా ఇప్పుడు ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్టుగా ఇపుడు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేసారు.

దీనితో రజిని లాంటి స్టార్ హీరో సినిమాలో సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చే రానా ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడో చూడాలి. రీసెంట్ గానే తాను రానా నాయుడు అనే సెన్సేషనల్ వెబ్ సిరీస్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రజినీకాంత్ చిత్రాన్ని దర్శకుడు జై భీం ఫేమ్ టి జి జ్ఞ్యానవేల్ తెరకెక్కిస్తుండగా రానా సహా మరింత మంది భారీ తారాగణం ఈ చిత్రంలో కనిపించనున్నారు. మరి ఉండగా ఉండగా ఇంకా ఎంతవరకు సినిమా వెళ్తుందో చూడాలి. ఇంకా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడు.