పింక్ కలర్ చీరలో మెరిసిపోతున్న రమ్య కృష్ణ… ఆమె కట్టుకున్న చీర ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

అలనాటి లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు లేడీ విలన్ నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. రమ్యకృష్ణ తన వైవిధ్యమైన నటనతో, అందంతో అందరిని బాగా ఆకట్టుకుని సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయనటిగా నటిస్తూ ఎన్నో కీలకపాత్రలో నటించింది. ఇక బాహుబలి సినిమాలో కీలక పాత్రలో నటించిన రమ్యకృష్ణ ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.

అప్పటినుండి రమ్యకృష్ణ ఇలా కీలక పాత్రలలో నటిస్తూ వస్తోంది. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో రమ్యకృష్ణ చాలా సందడి చేసింది. వయసు పెరిగినా కూడా రమ్యకృష్ణ ఇప్పటికీ హీరోయిన్లతో సమానంగా తన గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో రమ్యకృష్ణ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవల పింక్ కలర్ చీరలో ఫోటోషూట్ కి ఫోజులు ఇచ్చిన రమ్యకృష్ణ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో రమ్యకృష్ణ పింక్ కలర్ చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది . అయితే ప్రస్తుతం రమ్యకృష్ణ కట్టుకున్న చీర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రమ్యకృష్ణ ఎప్పుడు ఖరీదైన చీరలు కడుతూ ఉంటుంది. ఇక ఇటీవల ఈ ఫోటోలలో రమ్యకృష్ణ కట్టుకున్న పింక్ కలర్ చీర ఖరీదు కూడా నెటిజన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రమ్యకృష్ణ కట్టుకున్న పింక్ కలర్ వెల్వెట్ చీర ఖరీదు అక్షరాల రూ. 1,25,000. ఈ చీర ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.