తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, కొన్నేళ్లపాటు ఇండస్ట్రీ నెం1 హీరోగా వెలుగు వెలిగిన చిరు ఎంతో మంది అప్‌కమింగ్ హీరోలకు ఆదర్శం.
ఇక సినిమాలతో పాటు కుంటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వారిలో చిరు ముందు వరసులో ఉంటారు. ముఖ్యంగా భార్య సురేఖపై తనకున్న ప్రేమను అడపాదడపా ఇంటర్వ్యూలో బయటపెడుతూనే ఉంటాడు చిరు. ఈ జంట 1980 ఫిబ్రవరి 20న వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీంతో మెగాస్టార్ వివాహం జరిగి నేటితో 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరు తనయుడు రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
చిరంజీవి, సురేఖల తనయుడు రామ్ చరణ్ తన ట్విట్టర్ ద్వారా తల్లిదండ్రుల ఫొటోని షేర్ చేస్తూ.. నా బలం మీరు.. ఇద్దరికి 42వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు మెగా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ‘సైరా నర్సింహా రెడ్డి’ సినిమా తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన చిరు ఇప్పుడు ఏకంగా మూడో సినిమాలతో బిజీగా మారాడు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.రంగస్థలం చిత్రంలో అసలు సిసలైన నటుడిగా ఆవిష్కరింపబడిన రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతరామరాజు పాత్రలో కనిపించి అలరించనున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
My biggest strength!!
Wishing you both a very Happy 42nd wedding anniversary 😜❤️!!@KChiruTweets pic.twitter.com/RjFyoPUbCN— Ram Charan (@AlwaysRamCharan) February 20, 2021