అప్పటివరకు “గేమ్ చేంజర్” లోనే రామ్ చరణ్..!

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ తెరకెక్కుతున్న కొన్ని స్టార్ హీరోస్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం “గేమ్ చేంజర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంని పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. దీనితో మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం గత రెండేళ్ల నుంచీ కొనసాగుతూనే వస్తుంది. అయితే మధ్యలో శంకర్ “ఇండియన్ 2” సినిమా కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో ఇది మరింత ఆలస్యం అయ్యింది. కాగా ఈ భారీ చిత్రం విషయంలో చరణ్ ఎప్పుడు ఫ్రీ అవుతాడు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మాత్రం ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా మారింది.

కాగా ఈ చిత్రం నుంచి చరణ్ ఎప్పుడు బయటకి వస్తాడా అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు శంకర్ అయితే రామ్ చరణ్ పోర్షన్స్ ని వచ్చే ఏడాది మార్చ్ ఎండింగ్ వరకు తెరకెక్కించనున్నారట. దీనితో రామ్ చరణ్ అప్పటివరకు ఖాళీ ఉండడు అని చెప్పాలి. మరి తన పోర్షన్స్ తర్వాత శంకర్ ఇంకా మిగతా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేయాల్సి ఉందట.

మరి దీనితో ఈ చిత్రం ఈ సినిమా వచ్చేసరికి ఇంకా చాలా సమయం పడుతుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ అలాగే అంజలి లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.