కొమురం భీమ్ స్పూఫ్ వీడియో.. గొండు గిరిజ‌నుల ప్ర‌య‌త్నానికి ఫిదా అవుతున్న నెటిజ‌న్స్

చరిత్ర‌, ఫిక్ష‌న్ అంశాల క‌ల‌బోత ఆధారంగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్( రౌద్రం ర‌ణం రుధిరం). అభిమానుల అంచ‌నాల‌ని రెట్టింపు చేసేలా ప్రేక్ష‌కులకు డ‌బుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేలా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆ త‌ర్వాత సీజీ వ‌ర్క్స్, గ్రాఫిక్స్ , పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నింటిని త్వ‌ర‌గా పూర్తి చేసి స‌మ్మ‌ర్‌లో సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద్భంగా ఆయ‌న లుక్‌కి సంబంధించి వీడియో విడుద‌ల చేసిన జ‌క్క‌న్న‌, రీసెంట్‌గా కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్‌కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు. రామ‌రాజు ఫ‌ర్ బీమ్ పేరుతో విడుద‌లైన ఈ వీడియో రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టించింది. పిల్లాడి నుండి పెద్దాళ్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్న ఈ వీడియోని ఇప్పుడు తెగ స్పూఫ్‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒరిజినాలిటీకి ఏ మాత్రం త‌గ్గ‌కుండా కుర్రాళ్లు చేస్తున్న స్పూఫ్ వీడియోలు భ‌ళా అనిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ టీం షేర్ చేసిన స్పూఫ్ వీడియో ఒకటి సోష‌ల్ మీడియాని షేక్ చేయ‌గా, ఇప్పుడు మ‌రో వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వంశీ అనే ఓ కుర్రాడు కొమరం భీమ్‌గా మారి త‌న సిక్స్ బాడీతో పాటు సీన్స్‌లో వావ్ అనిపించాడు. గొండు గిరిజనులు క‌లిసి చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే చివ‌ర‌లో టోపి తీసేయాల‌ని, లేదంటే ఎందుకు పెట్టారో చెప్పాలంటూ కోరారు. నిజాం దొరకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ను ముస్లింగా చూపించ‌డంపై అనేక మంది గిరిజ‌న సంఘాలు ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బేన‌ర్‌పై నిర్మిత‌మవుతున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. అలియా భ‌ట్, ఒలీవియా మోరిస్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.