Home TV SHOWS స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేసింది.. లేడీ ఫాలోయింగ్‌లో రామ్‌ రేంజే వేరయా!!

స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేసింది.. లేడీ ఫాలోయింగ్‌లో రామ్‌ రేంజే వేరయా!!

ఎనర్జిటిక్ హీరో అన్నా చాక్లెట్ బాయ్ అన్నా కూడా అందరికీ ఒకే పేరు గుర్తుకు వస్తుంది. అదే ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్. ఒకప్పుడు ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు రామ్. అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారిపోయాడు. రామ్‌కు లేడీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. రామ్ కెరీర్‌లో ఎక్కువగా ఉన్నవి కూడా ప్రేమ కథా చిత్రాలే. ఈ మధ్యే రామ్ రూట్ మార్చేశాడు. మాస్ మంత్రాన్ని జపిస్తూ లుక్, మేకోవర్ మొత్తాన్ని మార్చేశాడు.

పూరి జగన్నాథ్ ఇస్మార్ఠ్ శంకర్ తరువాత రామ్ పూర్తిగా మారిపోయాడు. మాస్ హీరోగా అవతారమెత్తేశాడు. అయితే అందులోనూ లవర్ బాయ్ వేషాలు వేశాడు. ఇక ఇప్పుడు వస్తున్న RED చిత్రంలో ప్రేమ కథలు ఉంటాయి. కానీ పూర్తి స్థాయి లవర్ బాయ్ వేషాలైతే కావు. కానీ తాజాగా రామ్‌కు ఉన్న లేడీ ఫాలోయింగ్‌కు ఓ చిన్న ఉదాహరణగా సంఘటన జరిగింది. జీ తెలుగు సంక్రాంతి ఈవెంట్‌లో హీరో రామ్ స్పెషల్ గెస్ట్‌గా వస్తోన్న సంగతి తెలిసిందే.

Ram Pothineni Gets Proposal In Zee Telugu Sankranthi Sambaralu 2021
Ram Pothineni Gets Proposal In Zee Telugu Sankranthi Sambaralu 2021

RED మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ జీ తెలుగు సంక్రాంతి ఈవెంట్‌లో రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే అక్కడ రామ్‌కు ఓ లేడీ అభిమాని ఉందన్న సంగతి తెలిసింది. సీరియల్ నటి ఏకంగా రామ్‌కు స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేసింది. స్కూల్ ఏజ్ నుంచి రామ్‌కు ఫ్యాన్ అట.. రామ్ చదువుకున్న స్కూల్‌లోనే సదరు నటి కూడా చదువుకుందట.. రామ్ కోసం వచ్చిన క్యారేజ్‌ను తాకి రెండు మూడు రోజులు అదే ధ్యాసలో ఉందట.. మొత్తానికి రామ్ అప్పట్లోనే లేడీస్‌ను ఫిదా చేసేశాడన్న మాట.

Related Posts

వివాదాల ‘రిపబ్లిక్’ పరిస్థితి ఏమవుతుందబ్బా.!

రిలీజ్‌కి ముందు వివాదాలు.. అనుకోకుండా ఆయా సినిమాలపై అంచనాలు పెంచేస్తుంటాయి. గతంలో చాలా సార్లు ఈ పరిణామాలు చూస్తూనే వచ్చాం. అయితే, ఈ సారి వివాదం కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంతకీ...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News