టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో రామ్ పోతినేని కూడా ఒకరు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన రామ్ పోతినేని మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రామ్ నటించిన సినిమాలు మంచి హిట్ అవ్వటంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇలా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల రామ్ నటించిన ది వారియర్ సినిమా హిట్ ఇవ్వలేకపోయింది.
ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో జరిగే ఎక్కుతున్న సినిమాలు రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “ఇది సన్ డే.. సిద్ధాంత్ పోతినేని” అంటూ.. ట్వీట్ చేస్తూ ఓ చిన్న పిల్లాడితో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. అయితే రామ్ ఇలా సన్ డే ట్వీట్ చేయడమే కాకుండా పిల్లాడి పేరు కూడా రామ్ ఇంటి పేరు కలిసేలా సిద్ధాంత్ పోతీనేని అని ఉండటంతో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
సన్ డే అని పోస్ట్ షేర్ చేయటంతో రామ్ కి పెళ్లి కాకుండానే కొడుకు పుట్టాడా? లేక రామ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న బాబు రామ్ పోతినేని అన్న కొడుకు. దీంతో ఆ బాబు రామ్ కి కూడా కొడుకు వరుస అవ్వటం వల్ల అల సన్ డే పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇంతకాలం రాం పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. అయితే తన పెళ్లి వార్తలపై స్పందించిన రామ్ ..ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ప్రస్తుతం తన కెరీర్ మీద మాత్రమే ఫోకస్ చేసినట్టు రామ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో రామ్ పెళ్ళి వార్తలకు బ్రేక్ పడింది.