రామ్ బుల్ ఫైట్.. నెవ్వర్ బిఫోర్ యాక్షన్

యంగ్ హీరో రామ్ పోతినేని కెరియర్ లో ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. రెగ్యులర్ లుక్స్ లోనే ఎక్కువగా రామ్ తన సినిమాలలో కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. అయితే డిఫరెంట్ క్యారెట్రైజేషన్ తో రామ్ చేసిన సినిమాలు కమర్షియల్ గా అతనికి సక్సెస్ ఇవ్వలేదు. రెడ్, ది వారియర్, జగడం సినిమాలు రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.

ఈ సినిమాతో ఈ ఏకంగా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సొంతం చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయిలో మాస్ క్యారెక్టర్ చేయాలని రామ్ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా తనని నెక్స్ట్ లెవెల్ మాస్ హీరోగా ఆవిష్కరిస్తుంది అని రామ్ పోతినేని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది.

అక్టోబర్ 20న మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక ఈ మూవీలో కర్లింగ్ హెయిర్ స్టైల్ తో, ఫుల్ గడ్డంతో రామ్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయని టాక్. ముఖ్యంగా బుల్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చిత్ర వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇక ఈ సీక్వెన్స్ ను 11 రోజుల పాటు హెవీ డ్యూటీ లైట్ ఎఫెక్ట్స్ తో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. అలాగే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో చేసిన ఐటెం సాంగ్ కూడా చాలా గ్రాండ్ లుక్ తో చిత్రీకరించారు. దీనికోసం హెవీ కలర్ ఫుల్ డ్యూటీ లైట్స్ ని ఉపయోగించినట్లుగా టాక్. సినిమాలో ఈ పాట చాలా హైలెట్ గా ఉండబోతుందని టాక్.

ఈ సినిమా కోసం మొదటిసారిగా 28కి పైగా హెవీ డ్యూటీ లైట్స్ ని ఉపయోగించడం సంచలనంగా మారింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమా సీక్వెన్స్ అన్ని కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉండాలని రామ్ పోతినేని కూడా కోరుకుంటున్నారు. అందుకే ఆ స్థాయిలో భారీగా బోయపాటి చిత్రీకరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఎస్ఎస్ తమను సంగీతం అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇక సంతోష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.