నేను చైన్ స్మోకర్ గా మారటానికి ఆ స్టార్ దర్శకుడే కారణం.. వైరల్ అవుతున్న రామ్ కామెంట్స్?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవదాసు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా రామ్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ పోతినేని ది వారియర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో రామ్ డి.ఎస్.పి పాత్రలో నటించాడు. ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రామ్ సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్నాడు. విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ పనులను జోరుగా సాగిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ దర్శకుడు సుకుమార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల జరిగిన ఇంటర్వ్యలో రామ్ తానొక చైన్ స్మొకర్ అని చెప్పుకొచ్చాడు. అయితే తాను అలా చైన్ స్మోకర్ గా మారటానికి మాత్రం సుకుమార్ కారణం ఆని వెల్లడించారు. రామ్ హీరోగా నటించిన జగడం సినిమ కోసం సుకుమార్ కూడ పని చేశాడు.

అయితే రామ్ కెరీర్ లోనే జగడం సినిమా ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా జగడం సినిమా షూటింగ్ సమయంలో రామ్ పోతినేని స్మోకింగ్ స్టైల్ సుకుమార్‌కి నచ్చేది కాదట . అందువల్ల రామ్ తన స్మోకింగ్ స్టైల్ మార్చుకునేందుకు, పదే పదే స్మోకింగ్ చేసేవాడట. అలా రామ్ తరచు స్మోకింగ్ చేయటంతో చెయిన్ స్మోకర్ గా మారినట్టు వెల్లడించారు. అయితే రామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.రామ్ ఈ విషయాన్ని సరదాగా అన్నాడా.? లేక సీరియస్‌గానే ఈ విషయాన్ని వెల్లడించేశాడా.? అని అనుమానాలు కలుగుతున్నాయి.