ప్రభాస్ సినిమాలో నటించిన రామ్ గోపాల్ వర్మ… ఏ పాత్రలో అంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం పలు వివాదాస్పద సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ సినిమాలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈయన వ్యూహం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా వర్మ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మూడో ప్రపంచం యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే నటిస్తున్నారు అదేవిధంగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రామ్ గోపాల్ వర్మ ప్రాజెక్టుకే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర చెప్పగానే డైరెక్టర్ వర్మ కూడా నటించడానికి సుముఖంగా ఉండడంతో ఆ పాత్రకు వర్మని ఫైనల్ చేశారట ఇక త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయడమే కాకుండా రామ్ గోపాల్ వర్మ పాత్రకు సంబంధించిన షూటింగ్ సన్ని వేషాలను కూడా పూర్తి చేయనున్నట్టు సమాచారం.ఇలా దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వర్మ మొదటిసారి ఇతర హీరోల సినిమాలలో కనిపించడం విశేషం.