pavan Kalyan – RGV: పవన్ కళ్యాణ్ ను సీఎం చేద్దాం అంటున్న కే ఏ పాల్..ప్రధాని మాట్లాడుతున్నాడు వినండి అంటూ వర్మ ట్వీట్!

pavan Kalyan – RGV: అనగానే వివాదం. ఏదో ఒక వార్తతో ఎప్పడు మీడియాకు జనాలకు అందుబాటులో ఉండటం అలవాటు. సూటిగా తనకు అనిపించింది మాట్లాడటం అమ్మాయిలతో తప్ప తాగి చిందులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వర్మకు మాములే. ఇక పవన్ గురించి వర్మ మాములుగా సటైర్లు వేయరు. ఏకంగా పవన్ స్టాన్ అనే సినిమా కూడా తీశారు. ఇక అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్ మీద సటైర్లు వేయడం వర్మకి సరదా. ఈ మధ్య రిలీజ్ అయిన భీమ్లా నాయక్ సినిమా పై కూడా సటైర్లు వేశారు.

ఇక కే ఏ పాల్ మాటల గురించి చెప్పే అవసరం లేదు అయన ఏదీ మాట్లాడిన దాన్ని ట్రోల్ చేయడం, సటైర్లు వేయడం అందరు చేసే పనే. ఈ మధ్యే కే ఏ పాల్ వీడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో పాల్ ఏమన్నారంటే పవన్ ఫ్యాన్స్ అందరికీ చెపుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ ను కావాలంటే ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేద్దాం తప్పేముంది అంటూ పాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోని వర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ప్రధాని మాట్లాడుతున్నారు వినండి పవన్ సార్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది పాల్ ను విమర్శిస్తుంటే.. మరికొంత మంది పాల్ తో పాటు పవన్ ను కూడా అంటున్నారు. మరికొంత మంది మాత్రం ఆర్జీవీ(RGV)కి ఈ వీడియో భలే దొరకిందంటూ.. గుసగుసలాడుకుంటన్నారు.