దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం ఏదో ఒక విషయం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ చేసే సంచలన వ్యాఖ్యలు కొన్ని సందర్భాలలో తీవ్ర దుమారం రేపుతాయి. రాంగోపాల్ వర్మ తన మనసులో ఉన్న మాటల్లేవి దాచుకోకుండా అందరి ముందు బయట పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని సందర్భాలలో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లడకి అనే సినిమా ఈనెల 15వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సాధారణంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకర్స్ సందడి చేస్తూ వచ్చిన అతిథులను అభిమానులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన లడికి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని యాంకర్ శ్యామల హోస్ట్ చేసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ యాంకర్ శ్యామల పై సీరియస్ అయ్యాడు. సినిమా గురించి మాట్లాడటానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. మాట్లాడి దిగిపోతుండగా శ్యామల అతనిని ఆపి.. ఆయనతో కలిసి ఓ ఫన్ గేమ్ ఆడించే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మొదట పాజిటీవ్ గా స్పందించాడు. కొంతసమయం తరువాత కోపంగా ఫేస్ పెట్టి.. సినిమా విషయంలో సీరియస్ గా ఉన్నానని చెప్పి.. ప్రస్తుతం జోకులు కాదు.. ఎమోషన్.. సినిమాపై సీరియస్ నెస్ అంటూ.. స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. దీంతో శ్యామల మొహం చిన్నబోయింది. ప్రస్తుతం వర్మ శ్యామలపై సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు బ్రూస్లీ మీద అభిమానంతో రామ్ గోపాల్ వర్మ ఈ సినీమా తెరకెక్కించారు. ఈ సినిమా పూజ భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాలో పూజ బ్రూస్లీ కి వీరాభిమాని గా నటించింది. ఈనెల 15వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ కన్నడ, భాషలతో పాటు చైనాలో కూడా 40 వేల థియేటర్లలో విడుదల కానుంది.